NationalNews

తెలుగు తేజం విజయేంద్రుడికి మోదీ వరం

Share with

రాజ్యసభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేయడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లను అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్… ఏవిధంగా ఇచ్చిందో చూశాం.. కానీ బీజేపీ అందుకు భిన్నంగా… రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయడానికి ఉన్న అవకాశాన్ని దక్షిణాది దిగ్గజాలకు ఇచ్చి గౌరవించింది. దేశ ప్రజలందరూ సమానమన్న భావన కలిగించేలా.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కళాకారులను కేవలం… కళకే పరిమితం చేయకుండా వారిని సమాజ సేవకు ప్రేరేపిస్తున్న మోదీ సర్కారు తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకొంది. గతంలో ఏ పాలకులు ఊహించని విధంగా విజయేంద్రప్రసాద్ లాంటి దర్శక దిగ్గజాన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది.

విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశం అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని… ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేసాయన్నారు మోదీ. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు ప్రధాని.

కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ ఇండియన్ స్క్రీన్ రైటర్ గా కొత్త శకాన్ని ఆవిష్కరించారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలకు పనిచేశారు. 25 సినిమాలకు స్క్రీన్ ప్లే రాయడంతోపాటు, దర్శకుడిగానూ పనిచేశారు. బాహుబిలి, ట్రిబుల్ ఆర్, బజరింగి బైజాన్, మణికర్నిక, క్వీన్ ఆఫ్ ఝాన్సీ, మగధీర, జెర్సీ ఎంతో ప్రజాదరణ పొందాయ్.