Andhra PradeshHome Page Slider

అసెంబ్లీలో పవన్ కామెడీ స్పీచ్..’అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్ చేసినట్లుంది’

Share with

నేడు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం కామెడీగా సాగింది. స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు చెప్పారు. ఆయనను స్పీకర్‌గా ఎన్నిక చెయ్యడం అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్‌గా చేసినట్లుందని నవ్వులు పూయించారు. అనంతరం అయ్యన్నపాత్రుడికి సభ్యులను తిట్టే అవకాశం లేకుండా పోయిందన్నారు. గతంలో శ్రీకాకుళం యాసలో అందరినీ దుమ్ము దులిపేవారని, కానీ ఇప్పుడు సభాపతిగా ఉన్నందున ఆ అవకాశం లేదని పేర్కొన్నారు. సభా మర్యాదను సభ్యులందరూ పాటించాలని, వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా పరిపాలన కొనసాగించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సభ్యుల ప్రవర్తన ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలతో, తిట్లతో కొనసాగిందని అలాంటి సంప్రదాయాలకు చెక్ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని అనుక్షణం గుర్తు చేసుకుంటూ సభకు అమర్యాద కలుగనివ్వనని ప్రతిజ్ఞ చేశారు.