Andhra PradeshHome Page Slider

ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Share with

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపును అమలు చేసి పంపిణీ చేసింది. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక,తెలంగాణాలో అమలు అవుతున్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో త్వరలోనే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కాగా జగన్ హయాంలో మంత్రుల మాదిరి గంగిరెద్దుల్లా తాము పనిచేయమని మంత్రి స్పష్టం చేశారు. మా ప్రభుత్వంలో చంద్రబాబు మాకు స్వేచ్ఛ నిచ్చారన్నారు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్ ,ఇసుక రంగాల్లో అవినీతి చేసిందన్నారు. కాగా ప్రజల సొమ్ము తిన్నవారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.