NationalNews

కేంద్రంపై మరోసారి మండిపడ్డ మంత్రి KTR

Share with

కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు మంత్రి KTR. నల్గొండలో ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ.19,000 కోట్లు కేటాయించాలన్న నీతిఆయోగ్ సిఫార్సును కేంద్రం పట్టించుకోలేదన్నారు. కానీ రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని KTR కేంద్రంపై మండిపడ్డారు. మోదీ ఇప్పటికైనా స్పందించి నల్గొండ జిల్లాకు రూ.18,000  కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని  KTR  కోరారు. ఈ ప్యాకేజీని ప్రకటిస్తే తాము పోటి నుంచి తప్పుకుంటామని KTR స్పష్టం చేశారు. దీనికి బీజేపీ సిద్ధమేనా అని KTR ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సవాల్ విసిరారు. కేంద్రం గుజరాత్‌కు 5 నెలల్లో రూ.80 వేల కోట్లు ఇచ్చిందన్నారు. మరి తెలంగాణాకు కనీసం రూ.18 వేల కోట్లు ఇవ్వలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోదీ మాకు రాజకీయ ప్రయోజనం కంటే నల్గొండ ప్రజల సంక్షేమమే ముఖ్యమని KTR తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.