Home Page SliderTelangana

“గనుల వేలంపాటను సింగరేణి సంస్థకే అప్పగించాలి”: తెలంగాణా డిప్యూటీ సీఎం

Share with

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి & ఇందన శాఖమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించమని కోరుతున్నామన్నారు. రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఇదే విషయం గురించి మాట్లాడబోతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన, కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థ భవిష్యత్తు కొనసాగాలంటే కొత్త గనులు రావడం తప్పనిసరి అన్నారు. ఈ గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాయించమని అడుగుతున్నామన్నారు. శ్రీ కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర నికి చెందినవారు కనుక ప్రత్యేక చొరవ తీసుకోవాలని ,అవసరమైతే ప్రధానమంత్రి తో అఖిలపక్షం ద్వారా కలవడానికి సహకరించాలని కోరుతున్నామన్నారు. అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.కాగా మా  ప్రాంతంగనులు మాకు ఇవ్వండి అని అడగడానికి మాకు ఎటువంటి  భేషజాలు లేవన్నారు. ఇటీవల వేలం పాటలో పెట్టిన సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల వేలంపాటదారులు ఇప్పటివరకు ఆ గనులను చేపట్ట లేదు కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరుతున్నామని తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.