Home Page SliderInternational

ఉక్రెయిన్ ఖైదీలకు మిలటరీ ట్రైనింగ్

Share with

ఉక్రెయిన్ దేశంలోని ఖైదీలకు ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది. రష్యాతో జరిగే యుద్ధంలో పాల్గొంటానంటే జైళ్ల నుండి విడుదల చేస్తామని పేర్కొంది. దాదాపు రెండేళ్ల నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో సైన్యానికి కొరత ఏర్పడుతోంది. దీనికోసం ఖైదీలను కూడా సైన్యంలోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది ఉక్రెయిన్. వారికి ప్రత్యేకంగా ఇంటర్యూలు నిర్వహించి, ఆర్మీలో చేరడానికి ఆఫర్ ఇస్తోంది. హత్యలు, అత్యాచారాలు వంటి కేసులలో శిక్ష అనుభవించే వారిని మినహాయించి ఇతరులను సమీక్షిస్తోంది. ఇప్పటికే  మూడువేలమంది ఖైదీలను మిలటరీలోకి తీసుకుంది. మరో 27 వేల మంది కోసం కొత్త రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ చేపట్టింది. వారికి ఆర్మీ క్యాంపుల్లో సాధారణ శిక్షణను ఇచ్చి యుద్ధపరికరాలను ఎలా ఉపయోగించాలో అనేది నేర్పిస్తారు. అయితే ఈ యుద్ధంలో తీవ్ర ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. కానీ ఉక్రెయిన్ వారి సంఖ్యను తెలియజేయడం లేదు. గతంలో రష్యా కూడా యుద్ధం కోసం ఖైదీలను సంప్రదించింది. అయితే ఈ ఖైదీలను ప్రభుత్వ సైన్యంలో కాకుండా వాగ్నర్ ప్రైవేట్ సైన్యంలో తీసుకున్నారు.