Home Page SliderTelangana

నూతన ప్రభుత్వానికి మెగాస్టార్ శుభాకాంక్షలు

Share with

తెలంగాణలో ఏర్పాటయిన నూతన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని ఆశ పడుతున్నట్లు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లు సాధించి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి నేడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు.