Home Page SliderTrending Today

బ్రహ్మానందం నటనను అభినందించిన మెగాస్టార్,గ్లోబల్ స్టార్

Share with

తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం అనే పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరనే చెప్పాలి. అంతేకాకుండా ఆయన తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పడూ మెదులుతూనే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వందలకొద్దీ తెలుగు సినిమాలలో తన నటన,హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే గత కొద్దీ రోజులుగా సినిమాల్లో కనిపించని ఆయన తాజాగా “రంగమార్తాండ”సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఉగాది కానుకగా తెలుగు రాష్ట్రాలలో నిన్న పలు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో “రంగమార్తాండ” సినిమా కూడా ఉంది. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం,రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాగా ఈ సినిమాలో బ్రహ్మానందం తండ్రి క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా  మెప్పించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి,గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బ్రహ్మానందాన్ని కలిసి శాలువతో ఆయన్ని సత్కరించారు. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.