Home Page SliderTelangana

‘లిటిల్ ప్రిన్సెస్‌’తో ఇంటికి మెగా ప్యామిలీ.

Share with

మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకున్న మెగా ప్యామిలీ, లిటిల్ ప్రిన్సెస్‌తో కలిసి ఇంటికి పయనమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రామ్ చరణ్. ఇంతకన్నా సంతోషకరమైన సందర్భం తనకు ఇంకేమీ లేదని చెప్పారు రామ్ చరణ్. బిడ్డ పుట్టినప్పుడు  ప్రతీ తండ్రి ఎలా ఫీలవుతారో తానుకూడా అలాగే ఆనందంగా ఫీలయ్యానన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలు మరిచిపోలేనని, అందరూ ఎంతో సపోర్ట్ చేసారని సంతోషం వ్యక్తం చేశారు. దేశవిదేశాల నుండి అభిమానులు, మిత్రులు అభినందనల వర్షంలో ముంచెత్తారని హర్షం వ్యక్తం చేశారు. పాప తన పోలికేనని రామ్ చరణ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  పాపకు ఎప్పుడు పేరు పెట్టాలో ఇంకా తెలియలేదన్నారు. సంప్రదాయాల ప్రకారం చెస్తామని మీడియాతో చెప్పారు. పాపకు ఒక పేరు అనుకున్నామని, అది నామకరణం రోజే చెప్తానన్నారు.