Home Page SliderTelangana

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర- మంత్రి సీతక్క

Share with

తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటిన ఘనత సమ్మక్క సారలమ్మ జాతరదన్నారు గిరిజిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. నాలుగు రోజులలో 1కోటి 45 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని చెప్పారు. అమ్మవార్లను దర్శించు కోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం ఈ ప్రాంత వాసులుగా గర్వకారణమన్నారు. జాతర నిర్వహణకు అత్యధికంగా నిధులు కేటాయించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75 రోజులు సమయంలో 65 రోజులలో జాతర నిర్వహణకు నిధులు మంజూరు చేయించి వరదల కారణంగా పూర్తిగా నష్టపోయినా మేడారం పరిసర ప్రాంతాలలో అన్ని మరమ్మత్తులు చేయించామన్నారు. ఇరవై శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను సక్సెస్ చేయడం జరిగిందన్నారు. క్యాబినెట్ లోని అన్ని శాఖల మంత్రులు జాతర నిర్వహణకు సహకరించారన్నారు. ఆర్టీసీ సంస్థ ద్వారా మేడారం జాతరకు 10 వేల ట్రిప్పుల బస్సులు నడిచాయన్నారు. 13మంది వివిఐపిలు, 150 మంది వీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. ఇద్దరు భక్తులు ప్రమాద వశాత్తూ చనిపోవడం జరిగిందన్నారు. గతంతో పోలిస్తే ఈ జాతర చాలా మెరుగుగా జరిగిందన్నారు. అమ్మవార్ల వన ప్రవేశానికి వెళ్లే సమయం వచ్చినప్పటికీ ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతుందన్నారు. జాతరలో ఏమైనా లోపాలు ఉంటే అధికారులతో రివ్యూ నిర్వహించి… శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామన్నారు. మిస్సింగ్ క్యాంపుల ద్వారా 5090 మంది భక్తులు తప్పితే 5060 మంది తప్పిపోయిన భక్తులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగిందన్నారు. ఇంకా 35 మందిని వారి కుటుంబ సభ్యులకు చేర్చాలన్నారు.

జాతర పూర్తైన పది రోజుల వరకు కూడా పారిశుధ్యం పనులు కొనసాగుతాయని మంత్రి సీతక్క చెప్పారు. తక్కువ కాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాతరకు సహకరించిన పూజారులు,ఆదివాసీలు,అధికారులకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. జాతరలో ఏమైనా లోటు పాట్లు ఉంటే మినీ మేడారం జాతర సమయానికి శాశ్వత ప్రాతిపదికన పూర్తీ చేస్తామన్నారు. ఈ ప్రాంత బిడ్డగా వచ్చే జాతరకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడతామన్నారు. బస్సుల సంఖ్య పెంచడం వల్ల బస్సులు కొన్ని సాంకేతిక లోపంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్నారు. కచ్చితంగా అందరి సూచనలు సలహాలు పాటిస్తామన్నారు. వచ్చే జాతరలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూస్తామన్నారు. అవసరమైతే శాశ్వత ప్రాతిపదికన క్యు లైన్ల లో టాయిలెట్లు, మంచి నీరు ఏర్పాటు చేస్తామన్నారు. వరదల మూలంగా మేడారం రోడ్లు భవనాలు మునిగిపోయాయన్నారు. తక్కువ టైంలో వాటిని మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఏషియాలోనే కాదు ప్రపంచం లోనే అతి పెద్ద జాతర మధ్యాహ్నం వరకే కోటి 35 నుండి 45 లక్షల భక్తులు వచ్చినట్టు ప్రాథమిక అంచనా అని చెప్పారు.