NationalNews

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం

Share with

దేశంలో డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ డ్రగ్స్ మాఫియా మాత్రం ఉన్న అన్నీ అడ్డదారులలో డ్రగ్స్‌ను దేశాలు దాటిస్తున్నారు. ఈ డ్రగ్స్ కారణంగా ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు రూ.13 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక యువకుడు ఈ డ్రగ్స్‌ను తన కడుపులో దాచుకున్నాడు. దీనిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. అధికారులు దేశంలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.