NationalNews Alert

ఫుల్ ఫామ్‌లో మాస్ మహారాజా

Share with

మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ధమాకా తో బిజిగా ఉన్న ఆయన వరుస సినిమా ఆఫర్లకు ఓకే చేప్తున్నారు. అతి త్వరలో ధమాకా విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘ టైగర్ నాగేశ్వరరావు ’ , ‘ రావణాసుర ’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య లో కూడా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే.

‘ రావణాసుర ’ చిత్రీకరణ దాదాపు పూర్తి అయినట్టే. ఇదిలా ఉండగా కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేనితో మరో సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ అని , ఆ సినిమాకు “ ఈగిల్ ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

Read more: ఆ యూట్యూబర్‌ ఆచూకీ చెబితే రూ.25 వేలు