Home Page SliderTelangana

మక్తల్ బీజేపీకి కంచుకోట 

Share with

మొదట్నుంచి ఇక్కడ సర్పంచ్‌లను ఎంపీటీసీలుగా, కౌన్సిలర్‌లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా గెలిపించుకున్న గడ్డ మక్తల్ గడ్డ…

మక్తల్ కాషాయ వనంలా కన్పిస్తోంది. మక్తల్ కాషాయానికి అడ్డా.. గెలిచేది కాషాయ జెండా. గెలిచే పార్టీ బీజేపీ. కేసీఆర్ ఎన్నికలప్పుడే కన్పిస్తాడు. హెలికాప్టర్‌లో వస్తాడు. హామీలిస్తాడు. ఓడెక్కేదాక ఓడమల్లప్ప, ఓడ దిగాక బోడి మల్లప్ప..

రేపే జీవో ఇస్తా.. అన్నీ ఇచ్చేస్తానంటాడు. మాటలు కానీ చేతలుండవ్.. కేసీఆర్ నైజం అర్థం కావడానికి పదేళ్లు పట్టింది. మాటలు కోటలు దాటతాయ్.. కాళ్లు మాత్రం తంగేళ్లు దాటవ్.. అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న అవినీతి ముఖ్యమంత్రిని, నియంత ముఖ్యమంత్రిని గద్దె దించేవరకు ప్రజలు నిద్రపోరు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేసీఆర్ అనుకుంటున్నాడు. కానీ ముఖ్యమంత్రిపైనే వ్యతిరేకత ఉంది. కేసీఆర్ ఏం చేస్తాడో.. కేసీఆర్ ఎమ్మెల్యేలు కూడా గదే పని చేస్తున్నారు. అహంకారం ప్రతి మాటలో ఉట్టిపడుతోంది. జర్నలిస్టులను కులం పేరుతో అవమానిస్తున్నారు. ఎన్నికలయ్యాక ఏరికోరి పనిచెప్తానంటున్నాడు.. మా వాళ్లు అప్పటికప్పుడు తిరిగుబాటు చేయకపోవచ్చు. సమాధానం చెప్పకపోవచ్చు.. గుండెలు రగిలిపోతున్నాయ్.. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్‌లు కత్తులు నూరుతున్నారు. ముదిరాజ్ తల్లి పాలు తాగి పెరిగిన బిడ్డ అని చెప్పాడు. తల్లిపాలు తాగి గుద్దినంత పనిచేశాడు దుర్మార్గపు కేసీఆర్..

44 నియోజకవర్గాలు ముదిరాజ్ ఓట్లు లేకుంటే గెలుస్తావా… మొత్తం జనాభాలో 11 శాతం ముదిరాజ్‌లున్నారు. వారు కన్నెర్రజేస్తే నీ అడ్రస్ గల్లంతవుతుంది. ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టారు. కచ్చితంగా నిన్ను గద్దెదించేవరకు నిద్రపోమని చెప్పారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి వరకు నాకించాడు. పేదోళ్లకు పుట్టానని, పదవిలో ఉన్నానని చచ్చిపోతానన్నాడు కేసీఆర్.. పదేళ్లవుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయాడు. మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఉంది. 4 కోట్ల పేదలకు ఇళ్లు కట్టించిన బిడ్డ నరేంద్రమోడీ.. ఈ రాష్ట్రంలో హైదరాబాద్‌లో అర్బన్ హౌజింగ్ కింద రెండున్నర లక్షల ఇళ్లు ఇస్తే లక్షా 35 వేలు మాత్రమే కట్టారు. కట్టినవి కూడా పంచలేదు. ఇచ్చినా కార్యకర్తలకే ఇచ్చారు. మక్తల్ నారాయణపేట ప్రజలారా మీకు హామీ ఇస్తున్నా.. బీజేపీని గెలిపించండి. సొంత ఇళ్లు కట్టే జిమ్మేదార్ తీసుకుంటాం.. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చాడా..

పేదలకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా.. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టు పక్కలా వేల ఎకరాల భూములు ఒక్కో ఎకరం 3 కోట్లు, 4 కోట్ల నుంచి 50 కోట్ల విలువైన భూములను ఈ దళితులకు భూమి ఎందుకని ల్యాండ్ పూలింగ్ పేరిట నాయకులను బెదిరించి… అమ్ముకోలేరని చెప్పి, దళితుల భూముల గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన వ్యక్తి కేసీఆర్.. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఏ ఊరికి పోయినా 50, 60 ఏళ్ల క్రితం భూములు అసైన్ చేస్తే వాటిని నమ్ముకొని బతుకుతుంటే… ఇవాళ ఆ భూములన్నింటినీ కేసీఆర్ గుంజుకున్నాడని కళ్లంట నీళ్లు పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పజెప్తున్నారు. రాజేందర్ అన్న గజ్వేల్ గడ్డ మీద నిన్నే గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు. కేసీఆర్, అల్లుడు హరీష్ రావు, కార్యకర్తలు తలకాయి కిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టినా గజ్వేల్ గడ్డపై గెలిచేది కాషాయజెండా. దళిత ప్రజలారా… బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎకరా భూమి  కూడా దళితుల భూమి తీసుకోం.. పూర్తి హక్కులు కల్పించే చట్టం తీసుకొచ్చి భూములు మీకే ఇస్తాం. దళితులు, పేదలన్నారని రూ.10 లక్షల దళితబంధు ఇచ్చారు.. కేసీఆర్‌కు అధికారం ఇచ్చింది 2023 వరకే. 2 లక్షల కోట్ల రూపాయలు దళితులకు ఎలా పంచుతావని అడిగా.. రాష్ట్ర ఖజానాకు ఇచ్చే దమ్ముందా అని అడిగా.. నేను కూడా ఆర్థికమంత్రిగా పనిచేశా.. కేసీఆర్ 2 లక్షల కోట్లు దళిత బంధు అమలు చేయాలంటే 40 ఏళ్లు పడుతుంది.. ఒకవేళ ఆదాయం పెరిగితే 20 ఏళ్లు పడుతుంది. 20 ఏళ్ల వరకు ఎవరుంటారో.. నా మక్తల్, నారాయణపేటలో దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు వచ్చిందా.. ఇవ్వడు.. ఎవరికీ ఇవ్వడు. మోసం.. దళితులపై ప్రేమతో కాదు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను ఓడించాలి.. అసెంబ్లీలో ముఖం చూడొద్దని దళితులకు పదేసి లక్షలు రూపాయలు పాస్ బుక్‌లో ఇచ్చి దేవుళ్లపై ప్రమాణం చేయించుకున్నారు. గొల్ల కురుములకు ఇక్కడ డబ్బులివ్వలేదు. హుజూరాబాద్‌లో లక్ష రూపాయలిచ్చాడు. ఎన్ని డబ్బులిచ్చినా, దావత్ లిచ్చినా, బిర్యానీలిచ్చినా.. హుజూరాబాద్ ప్రజలు గుద్దు గుద్దితే దిమ్మతిరిగిపోయింది.. డబ్బు సంచులను కేసీఆర్ నమ్ముకున్నాడు. మందు సీసాలను నమ్ముకున్నాడు. గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలను నమ్ముకున్నాడు. డబ్బులు తీసుకోండి. దావత్‌లు తీసుకోండి. ప్రమాణం చేయండి.. మొదటి ప్రమాణం బీజేపీకే ఓటేస్తామని చేయండి. తదుపరి చేసే ప్రమాణం మీకే అని చెప్పండి.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు మక్తల్ వచ్చా.. ఉపాసం ఉండి ఉద్యమం చేశానన్నాడు. అటుకులు బుక్కి చేశామన్నాడు.. అలా పార్టీ నడిపిన కేసీఆర్‌కి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడివి.. పార్టీ ఎకౌంట్‌లో వెయ్యి కోట్లు ఎలా వచ్చాయ్.. తెలంగాణ ఉద్యమంలో వందల మంది పిల్లలను పోగొట్టుకున్నాం.. నీళ్లొస్తాయని, ఉద్యోగాలొస్తాయని, నిధులొస్తాయని అనుకుంటే.. తెలంగాణ ప్రజలకు బంగారు బతుకు రాలేదు. కానీ కేసీఆర్ కుటుంబానికి బంగారు బతుకు వచ్చింది. కుటుంబం మొత్తం మంచి పొజిషన్లు.. ఒక్క కుటుంబంలో ఐదు పోస్టులు. మన కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుకున్నా.. ఉద్యోగం రాక.. పెళ్లిళ్లు కాక అవమానపడుతున్నాం.. బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం.. నిరుద్యోగ బిడ్డలకు ఇదే హామీ.. హైదరాబాద్‌లో వందల ఐటీ కంపెనీలున్నాయ్.. కానీ ప్రభుత్వానికి మనగడ్డ బిడ్డలపట్ల సోయి లేదు. మనవాళ్లు లిఫ్ట్‌బాయ్‌గా, డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తారు. పెద్ద పెద్ద నౌకరీలు బయటవాళ్లు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం.. ఉద్యోగం కాదు.. మీ కాళ్ల మీద మీరు నిలబడటానికి అనేక రకాల పథకాలు పెడతాం.. బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి ఏ బిజినెస్ చేసినా ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తామని చెప్పారు. రుణాలు ఇచ్చి బతుకులు మార్చుతాం… పేదవాళ్లకు క్యాన్సర్ రోగం వస్తే, కిడ్నీ ఫెయిల్ అయితే, యాక్సిడెంట్ అయితే దవాఖానాకు వెళ్తే రూ.10 లక్షలవుతున్నాయ్. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ రూ.10 లక్షల లోపు వైద్యం ప్రభుత్వమే భరించి అండగా ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వస్తే అపారమైన అనుభవం ఉన్న ప్రభుత్వం మాదే అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. వైద్యంతోపాటు మా గ్రామీణ ప్రజలకు, పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా విద్య కావాలని చెప్పా.. నువ్వు హామీ ఇవ్వు అమలు చేస్తానని చెప్పారు. తెలంగాణ ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఆ రైతులు ఇవాళ బాధపడుతున్నారు. కౌలు రైతులు సచ్చిపోతే ఐదు పైసల సాయం చేయడు. కానీ పంజాబ్, హర్యానా రైతులకు సొంత జాగీరులా మన డబ్బులు అక్కడ పంచాడు. కౌలు రైతులకు పరిహారం ఇవ్వలేదు. రాలేదు. వడ్లు పండిస్తే ఎమ్మెస్పీ వస్తే రూ.2,200 కు అమ్ముతున్నాం క్వింటాకు 4 నుంచి 10 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. కట్ చేస్తున్నారు. ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తే గింజ కూడా తరగు లేకుండా ధాన్యం కొంటాం. ఇప్పుడు వరి ధాన్యం రూ.2,200 ఉంది, అది వచ్చేనెల మూడో తారీఖు నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.3,100 కి కొనే జిమ్మేదార్ ప్రభుత్వం బీజేపీ అవుతుంది. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పంటకు రూ.5 వేలు, మోడీ ఇచ్చే సబ్సిడీ పంటకు రూ.9 వేలు. రూ.5 వేలు ఇచ్చేది ఆయన రూ.9 వేలు ఇచ్చేది మోడీ సర్కార్. రెండో పంటకు ఎరువులపై రూ.9 వేలు మోడీ ఇస్తున్నారు. రైతు బంధు ఇచ్చి అన్నీ ఎండబెట్టాడు.. సబ్సిడీ ట్రాక్టర్లు లేవు.. ఫసల్ బీమాతో సహా అన్ని సబ్సిడీలు ఇస్తాం… రైతులకు రూ.5 లక్షల బీమా వస్తోంది. కూలి పనులు చేసేవాళ్లకు రావడం లేదు. అందరికీ రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ గడ్డపై బీఆర్ఎస్ మూడో స్థానంలోకి నెట్టబడింది. కాంగ్రెస్ పార్టీకి కింద కార్యకర్తల్లేరు. నాయకుల్లేరు. కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు. కొన్ని ఆంధ్రా చానెళ్లు పనిగట్టుకొని కాంగ్రెస్ గెలుస్తుందంటున్నారు. కానీ బీజేపీ బలం, మోదీపై విశ్వాసం వారికి ఉందా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమీ ఇవ్వలేరు. కేంద్రం అండలేకుండా ఇచ్చిన హామీలు అమలు చేయలేరు. 45 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఒక్క ఎస్సీ, ఒక్క ఎస్టీని, ఒక్క మైనార్టీనీ, ఒక్క బీసీని సీఎంని చేసిందా. టీడీపీ అధికారంలోకి వస్తే వారే వస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా వారే వస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడు సీఎం అవుతారు.. తెలంగాణ ప్రజలు ఆనాడు ప్రధాని అభ్యర్థి అని ఆశీర్వదించారు. మళ్లీ గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ఇచ్చే బాధ్యత నాది అన్నారు. మొత్తం తెలంగాణలో 70 సీట్లు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి వస్తారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. రెవిన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత బీజేపీది. కనీస బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం కాదు. జీవో నెంబర్ 69 నాలుగు మండలాలకు నీళ్లు వచ్చేలా చేస్తాం.. రూ.1,400 కోట్లిచ్చామన్నాడు. తట్టెడు మట్టి తీయలేదు. డబ్బులిచ్చి పనిచేసి, బీజేపీ అధికారంలోకి వస్తే చేస్తాం… మాదాసి కురుమల సమస్యను బీజేపీ పరిష్కరిస్తుంది.. బీజేపీ హామీలు రెండు మనకు అండగా నరేంద్రమోడీ ఉంటారు. రెండోది తెలంగాణ బాగుపడటానికి కేంద్రం అండ తప్పకుండా ఉంటుంది. బీజేపీకి ఓటేసి గెలిపించాలి..