Home Page SliderNational

మంచి మనసు చాటుకున్న మహేశ్‌బాబు కూతురు సితార

Share with

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలోనూ ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే ఆయన గారాల పట్టీ సితార కూడా తండ్రి బాటలోనే నడుస్తూ..తండ్రికి తగ్గ కూతురు అనిపిస్తున్నారు. కాగా సితార ఇటీవల ఓ జ్యూవెల్లరీ కమర్షియల్ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌కు సితార రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ మొదటి రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చారని సితారను అడిగారు. అందుకు సితార ఛారిటీకి ఇచ్చా అని చెప్పారు. దీంతో అందరు సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే మంచి మనసు చాటుకున్న సితారకు మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందిస్తున్నారు.