Andhra PradeshHome Page Slider

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

Share with

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గంట క్రితమే పిన్నెల్లి ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎన్నికలలో అల్లర్లు సృష్టించడం, ఈవీఎంల విధ్వంసం సహా మూడు కేసులలో పిన్నెల్లి ముద్దాయిగా ఉన్నారు. నేడు పిటిషన్ రద్దు చేయడంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈయనపై ఈవీఎం ధ్వంసం, వ్యక్తులపై హత్యాయత్నం,మహిళను బెదిరించడం, కారంపూడిలో సీఐపై హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయి. ఈ నాలుగు కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికలలో అనుచితంగా ప్రవర్తించి, ఎన్నికల అధికారులను భయపెట్టి, ఈవీఎంలను విధ్వంసం చేసినందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కేసు పెట్టారు. దీనితో ఆయన అరెస్టు నుండి తప్పించుకోవడానికి గతంలో ముందస్తు బెయిలు, మధ్యంతర బెయిలుకు అప్పీలు చేసుకున్నారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిలును మంజూరు చేసిన కోర్టు నేడు ఆ బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ  తీర్పు ఇచ్చింది. దీనితో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేశారు. ఆయనను నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మాచర్ల కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది.