Andhra PradeshHome Page Slider

సీఐడీ నోటీసులపై లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్

Share with

తనకు సీఐడీ పంపిన 41 ఏ నోటీసులో నిబంధనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోసం లోకేష్ ప్రధానంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తమకు సంబంధించిన హెరిటేజ్ సంస్థ ఖాతా పుస్తకాలను సీఐడీ అధికారులు అడగడంతో కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రేపు విచారణకు రావాలంటూ నోటీసులు అందడంపై కూడా ఆయన అంగీకరించడం లేదు. హెరిటేజ్‌కు సంబంధించిన భూముల వివరాలను, సంస్థ మీటింగ్స్‌కు సంబంధించిన మినిట్స్ వివరాలను కూడా తమకు తెలియజేయాలంటూ సీఐడీ ఆదేశించడంతో దీనిని వ్యతిరేకిస్తూ నేడు కోర్టు ప్రారంభం కాగానే లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే మాజీ మంత్రి నారాయణకు కూడా రేపు లోకేష్‌తో పాటు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. దీనితో ఆరోగ్య కారణాల రీత్యా తాను విచారణకు గుంటూరు రాలేనని, తనను ఇంట్లోనే విచారించాలని నారాయణ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.