Home Page SliderNational

లోక్ సభ తొలి విడత నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Share with

తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. భారత ఎన్నికల సంఘం ఈరోజు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫేజ్ 1 కోసం గెజిట్ నోటిఫికేషన్‌ను ఈసీ జారీ చేసింది. 21 రాష్ట్రాలు/పలు యూటీలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19, 2024 ఎన్నికలు జరగనున్నాయి. 20 రాష్ట్రాలు/యూటీలకు ఫేజ్ 1లో నామినేషన్ల చివరి తేదీ మార్చి 27, 2024; బీహార్‌కు మాత్రం మార్చి 28 వరకు అవకాశమిచ్చారు. ఫేజ్ 1లో చేర్చబడిన రాష్ట్రాలు/UTలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్,
సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు, జమ్మూ మరియు కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి.