Home Page SliderTelangana

కేసీఆర్ నీ బలమెంతో నా బలమెంతో తేల్చుకుందాం రా.. ఛాలెంజ్-ఈటల

Share with

సిద్దిపేట: నా మొహం అసెంబ్లీలో కనిపించకూడదని కెసిఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇబ్బంది పెడుతుంటే, కెసిఆర్ నువ్వు హుజురాబాద్ రా నా మొఖం చెల్లుతుందో నీ మొఖం చెల్లుతుందో అని ఛాలెంజ్ జేసిన.

ఆయన రాకపోయేసరికి నీ ముఖం చెల్లుతుందో?  నాది మొఖం చెల్లుతుందో అని తేల్చుకుందామని నేనే గజ్వేల్‌కి వచ్చాను. దుబ్బాక ప్రజలు బిజెపిని గెలిపించిన తర్వాత కెసిఆర్ దిమ్మతిరిగింది. బలహీనవర్గాలకు నిలయమైన తెలంగాణలో కాంగ్రెస్ కానీ, బిఆర్ఎస్ కానీ ఆ వర్గాలకు సముచిత స్థానం  ఇవ్వలేదు. బీసీనీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని ధైర్యంగా ప్రకటించారు. బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి లేదా పార్టీ అధ్యక్ష పదవి కెసిఆర్, కేటీఆర్, హరీష్, ఆయన కూతురు తప్ప వేరే వారికి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బీసీలను ముఖ్యమంత్రి  చేసింది లేదు. మన ప్రధాని మీ చేతిలోనే అధికారం పెడతానని, మీ కష్టాలని బాధని తీర్చే అవకాశం మీకే అందిస్తామని చెప్తున్నారు, కాబట్టి అందిపుచ్చుకోండి. నరేంద్రమోడీ మాట ఇస్తే తప్పే బిడ్డ కాదు. ఆయన ఇంకా కొన్ని హామీలు మీకు ఇవ్వమని చెప్పారు.

• సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము.

• రేషన్ కార్డులు ఇచ్చే జిమ్మేదార్ మాదే. కెసిఆర్ రేషన్ బియ్యం బంద్ పెట్టారు. ఇప్పుడు ఇచ్చే 

   బియ్యం కేంద్రం ఇస్తోంది.

• ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య, పది లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా అందిస్తాం.

• పేదవారికి సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము.

• 3,100 రూపాయలు మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యం కొనుగోలు చేస్తాము. దీనివల్ల ఒక్క ఎకరానికి 20 వేల రూపాయలు అదనంగా అందుతుంది. ఒక పంటకి యూరియా లాంటి ఎరువుల మీద కేంద్రం 9 వేల రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. కేసిఆర్ ఐదు వేల రూపాయల కోసం చూద్దామా పంటకి రూ.20 వేలు ఇచ్చే మద్దతు ధర గురించి చూద్దామా ఆలోచన చేయండి.

• మహిళా సంఘాలకు 4,800 కోట్ల రూపాయలు కెసిఆర్ బకాయి పడ్డారు. బీజేపీ రాగానే వాటిని చెల్లిస్తాం.

• కెసిఆర్ ఇచ్చే సారా సీసాలకు, బిర్యానీ పొట్లంకు, ఓటుకు పదివేల రూపాయలకు ఆశపడి ఓటు వేస్తే మన జీవితాలు ఆగమవుతాయి.

• గజ్వేల్లో ఒక ఎకరం పోకుండా చూసే బాధ్యత నాది.

• మీ కాలిలో ముల్లు విరిగితే పంటితో తీసే విధంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను.