Home Page SliderNational

తక్కువ ధరకు భూములు కొట్టేసేందుకు ఉద్యోగాల ఎర కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి విచారణ

Share with

బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ అధికారులు ప్రవేశించారు. ఉద్యోగాలు ఎర వేసి… తక్కువ ధరకు భూములు కొనుకోలు చేసిన… ఉద్యోగాలు-భూముల కొనుగోలు వ్యవహారంపై మాజీ సీఎం రబ్రీదేవి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఆమె నివాసంలో చేరుకున్నారు. కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని పాట్నాలోని ఆమె నివాసంలో ప్రశ్నిస్తున్నారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని, ఇది రైడ్ లేదా సోదాలు కావని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే రబ్రీ దేవి నుంచి ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

బీజేపీ రాజకీయ ఉద్దేశాల కోసం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ పంపిన ఒక రోజు తర్వాత రబ్రీ దేవి విచారణ సాగడం విశేషం. ప్రధానికి లేఖ రాసిన ముఖ్యుల్లో రబ్రీ దేవి తనయుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. కేంద్ర ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష నేతలలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఏజెన్సీల ఎత్తుగడలు పాలకుల ఎత్తుగడల కోసం పనిచేస్తున్నాయన్న అనుమానం కలుగుతున్నాయని వారు లేఖలో పేర్కన్నారు.

ఈ స్కామ్‌కు సంబంధించి… సీబీఐ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవి, వారి కుమార్తెలు మిసా, హేమ తదితరుల పేర్లు ఉన్నాయి. మే 2022లో నమోదైన ఎఫ్‌ఐఆర్, 2004-2009 మధ్య కాలంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులు తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. లాలూ, అతని భార్య, కుమార్తెలతో పాటు, భూమికి బదులుగా ఉద్యోగాలు పొందిన 12 మంది వ్యక్తుల పేర్లను FIR పేర్కొంది. గత ఏడాది జూలైలో, ఈ కేసులో లాలూ సహాయకుడు, మరియు మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) భోలా యాదవ్‌ను సిబిఐ అరెస్టు చేసింది.

ఈ కేసుకు సంబంధించి లాలూ కుటుంబ సభ్యులు, ఇతర నిందితులు ఢిల్లీ కోర్టులో హాజరు కావడానికి వారం రోజుల ముందు రబ్రీ దేవిని సీబీఐ ప్రశ్నిస్తోంది. కుట్ర, అవినీతి నేరాల కింద సీబీఐ గతేడాది చార్జిషీట్ దాఖలు చేసింది. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్‌లలోని గ్రూప్-డి పోస్టుల్లో పాట్నా వాసులు అయినప్పటికీ కొంతమందిని ప్రత్యామ్నాయంగా నియమించారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. దీనికి ప్రతిగా, ఈ వ్యక్తులు తమ భూమి యాజమాన్యాన్ని లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ ధరకే ఆ భూములను లాలూ కుటుంబం లాగేసుకుందన్న విమర్శలు వచ్చాయి. రైల్వేశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని సీబీఐ పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఆర్జేడీ నేతలు ట్యాగ్ చేస్తూ ట్రాష్ చేశారు. లాలూను చూసి బీజేపీ భయపడుతోందని రబ్రీదేవి గత వారం అన్నారు. “మేము పారిపోం. గత 30 సంవత్సరాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. బీహార్‌లో లాలూ యాదవ్‌ను చూసి బీజేపీ భయపడుతోంది.”