Home Page SliderTelangana

ఇవాళ హైదరాబాద్‌లో KTR రోడ్ షో

Share with

ఈ రోజు హైదరాబాద్‌ శివారులోని జవహర్ నగర్‌లో  తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ ప్రధాన మార్గంలో KTR రోడ్ షో నిర్వహించారు.  ఈ నేపథ్యంలో BRS నేతలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రి KTRకు ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో KTRతోపాటు తెలంగాణా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా వీరిద్దరు ఈ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మేయర్ కావ్య ఆధ్వర్యంలో లీచెల్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. అంతేకాకుండా GO 58,59 ఇళ్ల పట్టాలను జవహర్ నగర్‌లోని లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ శ్రీనివాస్,కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు.