Home Page SliderTelangana

3 హామీలు ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలంటూ మోడీని ప్రశ్నించిన కేటీఆర్

Share with

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన మూడు హామీలను ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీని డిమాండ్ చేశారు ఐటీ మంత్రి కేటీఆర్. మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి తెలంగాణకు వస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాయమాటలు చెప్పి పాలమూరుకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని పదేళ్ల పాలనలో.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాదు, 140 కోట్ల మంది భారతీయులు మోసపోయారని అన్నారు. మీ మిత్రుడికి ఇచ్చిన హామీలే కాకుండా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చారని ప్రశ్నించారు. పసుపు బోర్డు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తరహాలో పోల్ జిమ్మిక్కేనా అని ప్రశ్నించారు. మా మూడు ప్రధాన హామీలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం ఖాయమని, మళ్లీ వంద చోట్ల బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అని అన్నారు.

  1. మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రాణం పోస్తారు?
  2. మన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు నిర్మిస్తారు?
  3. మన పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు వస్తుంది?