Home Page SliderTelangana

కేబీఆర్ పార్కును కబళిస్తున్న కేటీఆర్ – రేవంత్ రెడ్డి

Share with

‘మంత్రి డెవలపర్స్’ పేరుతో KTR హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనకి ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని కేబీఆర్ పార్కు వద్ద భూమిలోపల 3 అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతివ్వడం అన్యాయం అన్నారు. కేబీఆర్ పార్కులో జాతీయపక్షి నెమళ్లతో పాటు చాలా వన్యప్రాణులు, విలువైన వృక్షాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కేబీఆర్ పార్కును వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి భూమాఫియాను అనుమతిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు, మంత్రి డెవలపర్స్‌కు సంబంధాలు ఉన్నాయని,  అందుకే వారికి అనుకూలంగా అనుమతులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్‌ను కాలుష్యనగరంగా మారుస్తోందని మండిపడ్డారు. కేటీఆర్‌ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు.