Home Page SliderNationalSports

కోహ్లీ సెంచరీ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌… శ్రీలంక టార్గెట్‌ 374 పరుగులు..

Share with

గువాహటి వేదికగా భారత్‌, శ్రీలంక తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. 80 బంతుల్లో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ సెంచరీ కాగా శ్రీలంక జట్టుపై తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో భారత మాజీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన వన్డే ఫార్మాట్‌లో శ్రీలంకపై 8 సెంచరీలు చేయగా.. కోహ్లీ తాజాగా శ్రీలంకపై తొమ్మిదో సెంచరీ చేసి సచిన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ సచిన్‌ పేరిట ఉన్న మరో రికార్డును సమం చేశాడు. స్వదేశంలో సచిన్‌ 20 సెంచరీలు సాధించగా.. తాజా సెంచరీతో విరాట్‌ కోహ్లీ సచిన్‌తో సమంగా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ఈ ఫీట్‌ సాధించేందుకు ఏకంగా 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు.  రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌గిల్‌ (70), అర్ధ సెంచరీలతో రాణించారు. విరాట్‌ కోహ్లీ (113) సెంచరీ చేసి (12 ఫోర్లు, ఒక సిక్స్‌) ఔటయ్యాడు. దీంతో 7 వికెట్ల నష్టానికి భారత్‌ 373 భారీ స్కోరు చేసింది. శ్రీలంక టార్గెట్‌ 374 పరుగులు. శ్రేయస్‌ అయ్యర్‌ (28), కేఎల్‌ రాహుల్‌ (39), హార్దిక్‌ పాండ్యా (14), అక్షర్‌ పటేల్‌ (9), మహ్మద్‌ షమీ (4)*, మహ్మద్‌ సిరాజ్‌(7)* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.