Home Page SliderTelangana

9 ఏళ్ల మోదీ పాలనపై కిషన్ రెడ్డి “రిపోర్టు టు పీపుల్” ప్రెజెంటేషన్

Share with

ప్రధాని మోదీ 9 సంవత్సరాల సుపరిపాలనలో తెలంగాణాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ‘రిపోర్టు టు పీపుల్’ అనే పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా వివరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఈరోజు ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. తెలంగాణా కోసం కేంద్రప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చిందని తెలియజేశారు. ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, ప్రధాని అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి అని వివరించారు. తెలంగాణాపై కేంద్రప్రభుత్వానికి వివక్ష లేదన్నారు.  ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు బండిసంజయ్, విజయేంద్రప్రసాద్, రాష్ట్ర డీజీపీ హాజరయ్యారు.

రాష్ట్రానికి ఈ తొమ్మిదేళ్లలో వివిధరకాలుగా కేంద్రప్రభుత్వం నుండి 1.78 లక్షల కోట్లు అందిందని తెలిపారు. హైదరాబాద్ ఓ ఆర్ ఆర్ కు 21,201 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 715 కోట్లు, చర్లపల్లి టెర్మినల్‌కు 221 కోట్లు, MMTS సెకండ్ ఫేజ్‌కు 1,153 కోట్లు కేంద్రఫ్రభుత్వ నిధులు కేటాయించిందని తెలిపారు.