News

ఫ్లైఓవర్ లు కట్టినంత మాత్రాన అభివృద్ధి కాదు: కిషన్ రెడ్డి

Share with

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి ఆశ చూపుతుందే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడం లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరెంట్ తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మౌలిక వసతులు కల్పించక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్తీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్, నాంపల్లి అసెంబ్లీ పరిధిలో కిషన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ డివిజన్ ఉషోదయకాలనీలో రూ. 8లక్షలతో పార్కు అభివృద్ధికి, 15.50 వేలతో ఫుట్ పాత్ నిర్మాణానికి, భోజగుట్ట శివాజీ నగర్లో రూ. 20 లక్షలతో డ్రైన్ నిర్మాణం, రూ. 21 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఆయా బస్తీలను కలియ తిరుగుతూ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. గుడిమల్కాపూర్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి వసతులు, వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మట్లాడుతూ.. ‘‘జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు నిధుల కొరతతో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడం లేదు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫ్లైఓవర్ లు కట్టినంత మాత్రాన హైదరాబాద్ అభివృద్ధి కాదన్నారు. నిజమైన హైదరాబాద్ నగరం బస్తీలలో ఉందని చెప్పారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది గానీ, అమలు పర్చడం లేదన్నారు.