Home Page SliderTelangana

పొంగిపొర్లుతున్న నాలల్ని పరిశీలించిన కిషన్ రెడ్డి

Share with

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాలను పర్యటించారు. పొంగుతున్న నాలాలను పరిశీలించారు. ఈ నాలాల కారణంగా బస్తీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.  మోకాలు లోతు నీటిలో యూసుఫ్ గూడాలో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణం శాఖ ఆదేశాలతో అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

హైదరాబాద్ రహదారులన్నీ వర్షం వస్తే చెరువులుగా తయారవుతున్నాయి. డ్రైనేజిలు పొంగి, కాలనీలను ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, హిమయత్ సాగర్‌లు పరిధిని మించి, ఉప్పొంగడంతో ఆ నీటిని దిగువ తూముల ద్వారా వదిలిపెడుతున్నారు. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిషన్ రెడ్డి ఈ ప్రాంతాలలో పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వారికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.