InternationalNews

“ప్రిన్స్ మీ వయసెంత?” చిన్నారి ప్రశ్నతో ఉలిక్కిపడ్డ కింగ్ చార్లెస్

Share with

లండన్: మనసర్కార్

చార్లెస్ 3 తూర్పు లండన్ టూర్‌లో నవ్వులు విరబూసాయి. సామాజిక సంస్థ జీరో వాల్తామ్ స్టోవ్‌ను సందర్శించడానికి వెళ్లిన చార్లెస్ అక్కడ బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కలిశారు. కాసేపు పిల్లలతో కులాసాగా గడిపారు. వారి సెలవుల గురించి… లంచ్ సమయం గురించి ప్రశ్నలు వేశారు. వారిలో ఒక చిన్నారి చార్లెస్‌ను మీ వయసెంత అంటూ ముద్దుగా అడిగింది. దీనితో అక్కడున్న టీచర్లు, చార్లెస్ సహా అంతా నవ్వేశారు. మీరే గెస్ చేయడంటూ తప్పించుకున్నారు చార్లెస్. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో చక్కర్లు కొడుతోంది.