NationalNews

కాంగ్రెస్ పార్టీలో నా రోలేంటి.. ఖర్గేను అడిగితే చెబుతారు?

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు కొన్నిసార్లు కొంత విచిత్రంగా ఉంటుంది. భారత్ జోడో యాత్రతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ… పార్టీలో తన రోలేంటన్నదానికి సమాధానమిచ్చారు. ఆ ప్రశ్న ఖర్గేజీని అడిగితే తెలుస్తోందన్నారు. పార్టీలో ఎలాంటి పాత్ర పోషించాలన్నది ఆయనే నిర్ణయిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శిశిథరూర్ పోటీపడగా.. గాంధీ కుటుంబ సభ్యులు ఖర్గేకు మద్దతుగా నిలబడ్డారన్న అభిప్రాయం నెలకొంది. శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే అది పార్టీకి ఇబ్బందన్న భావనలో వారున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం నేత ఎన్నికల నిర్వహకుడు మిస్త్రీకి లేఖ రాశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత తీవ్రమైన అక్రమాలు జరిగాయన్నారు. ఒక మైలురాయిగా పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికలు ఇలా జరగడం దారుణమన్నారు. ఐతే మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నిక దాదాపు లాంఛనంగా కన్పిస్తోంది.