Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే

Share with

బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ నిన్న పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ..కేటీఆర్ తన ఫ్రెండ్ కోసమే తనకు టికెట్ రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. అయితే తన స్థానంలో కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తారో చూస్తానని రేఖా నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. కాగా ఖానాపూర్ గడ్డా..రేఖానాయక్ అడ్డా అని ఆమె తేల్చి చెప్పారు.ఈ విధంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చేప్తానని రేఖానాయక్ తెలిపారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని రేఖానాయక్ మండిపడ్డారు.