Andhra PradeshHome Page Slider

ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనిరతికి మారుపేరు..సీఎం జగన్

Share with

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జ‌గ‌న్‌

విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్‌ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుంది

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి

ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది

మన ప్రభుత్వం– పోలీసు సంక్షేమం

సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన ‍యోధుడు పోలీస్ అని సీఎం జగన్ కొనియాడారు. ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనీరతి అని, పోలీస్‌ ఉద్యోగం అనేది ఓ సవాల్‌.. బాధ్యత అని అలాంటి పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి నివాళులర్పించారు. 1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఆమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం అని అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో ఇలా దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులు అందరికీ శ్రద్ధాంజలి ఘటించారు.

కొత్త టెక్నాలజీని అనూహ్యంగా వాడుకుని విజృంభించే అసాంఘిక శక్తులు విసిరే సవాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం విసురుతూ ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరి సిద్ధం కావాలని సూచించారు. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారన్న వాస్తవం అన్నారు.

“అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీవాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడం, ఆ తర్వాత పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాలే చివరకి ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ, అవినీతి, నేరాలు చేస్తే ఆ పైన ఆధారాలు అన్ని చూసిన పిమ్మట న్యాయస్ధానాలన్నీ వీరికి అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద ట్రోలింగ్‌ చేస్తారు.

“ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంక్షేమం గురించి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను ఈ నాలుగేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో మనందరి ప్రభుత్వం నియమించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ తీసుకునివచ్చాం అని పేర్కొన్నారు.