Home Page SliderNational

ఉగ్రదాడిపై శివసేన ఎంపీ కీలక వ్యాఖ్యలు

Share with

జమ్మూకశ్మీర్‌లోని ఫూంఛ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాగా ఉగ్రవాదులు నిన్న ఆర్మీ ట్రక్కుపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. నిన్న ఫూంఛ్ జిల్లాలోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రమూకలు కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. కాగా ఈ దాడిలో 5గురు జవాన్లు అమరులయ్యారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది జమ్మూకశ్మీర్‌లో నెల రోజుల వ్యవధిలో సైన్యంపై జరిగిన రెండో దాడి.దీంతో ఆర్మీ అధికారులు,ఆర్మీ బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్‌లో నిన్న జరిగిన దాడి మరో పుల్వామా ఘటనలా ఉందన్నారు. దేశంలోని జవాన్ల త్యాగాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో 2024లో మళ్లీ ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్నారా అని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నిస్తే మమ్మల్ని ఢీల్లీ నుంచి లేదా దేశం నుంచే తరిమేస్తారు అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.