Home Page SliderTelangana

వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాన్ని పట్టించుకోండి కేసీఆర్…

Share with

వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాన్ని పట్టించుకోండి కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీ పేరుతో కొన్ని వందల కోట్లు కేంద్రం నిధులు ఇచ్చింది. వాటిని ఖర్చుపెట్టి మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడమంటూ విజ్ఞప్తి చేశారు. నేడు కుంభవృష్టితో అతలాకుతలం అయిన హన్మకొండ, వరంగల్ లను పరిశీలించారు ఈటల రాజేందర్. నయీంనగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో కలియతిరిగారు. నిన్న నీటిలో మునిగిన ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. కావల్సిన నిత్యావసర వస్తువుల వెంటనే అందిస్తామని తెలిపారు. పులివెల్పులలో మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇంత కుంభవృష్టి ఎప్పుడు కురవలేదు అని పెద్దవారు చెప్తున్నారు. హన్మకొండ, వరంగల్ లో అన్ని కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి.12 ఫీట్ల నీళ్ళు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. పిల్లల సర్టిఫికెట్లు కరాబ్ అయ్యాయి. ఏ ఇంటికి పోయిన తడిచిన బియ్యం, పప్పులు, బట్టలు దర్శనమిస్తున్నాయి. లక్ష నుండి 20 లక్షల వరకు ఒక్కో షాపు నష్టం జరిగింది. ఇక్కడి నాలాలు 75 శాతం కబ్జాకు గురి అయ్యాయి. హైదరాబాద్ లో వరదలపుడు 10 వేల రూపాయలు ఎలా ఇచ్చారో. ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం వరద ప్రాంతాలలో నష్ట పరిహారం అందించాలి. ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇవ్వాలి. ఒక్కో షాపులు 2 లక్షలు ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. బ్రిడ్జిలు, రోడ్లు, కల్వర్టులు వెంటనే బాగు చేయడానికి నిధులు విడుదల చేయాలి. వాగుల మీద చెక్ డాం తెగి.. పంట పొలాలు కోతకు గురి అయ్యాయి వాటికి నష్ట పరిహారం ఇవ్వాలి. మేకలు, గొర్లు, బర్లు కొట్టుకు పోయాయి. వారికి కూడా నష్ట పరిహారం అందించాలి. కూలిపోయిన ఇళ్లకు వెంటనే డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలి.

భూపాలపల్లి జిల్లా మొరంచ పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు ఆ గ్రామంకు వెళ్తున్నాం. మా పార్టీ నాయకులు లారీలలో బియ్యం, దుప్పట్లు తీసుకొని వెళ్తున్నారు. సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి మానవతా కోణంలో ఆదుకుంటామని చెప్పమన్నారు. బీజేపీ తరపున ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందిస్తాం. చనిపోయిన కుటుంబానికి 50 వేల సాయం అందిస్తామని హామీ ఇవ్వనున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.