Home Page SliderNational

మధ్యాహ్నం 3 గంటలకు 52 శాతం పోలింగ్

Share with

కర్నాటకలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్‌లలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఫలితాల తర్వాత, 224 మంది సభ్యులతో కూడిన సభలో 104 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి BJPని పిలిచారు. అయితే, కాంగ్రెస్ మరియు JD(S) త్వరగా కలిసి 116 సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు కూలడంతో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బుధవారం సాయంత్రం వెలువడతాయి.