Home Page SliderNational

ప్రజలు ప్రేమను కోరుకున్నారు, ద్వేషాన్ని కాదు.. రాహుల్ గాంధీ

Share with

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. రాహుల్ మాట్లాడుతూ..ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ద్వేషం మనే మార్కెట్ మూసివేశారని… ప్రేమ దుకాణాలు తెరిచారన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

కర్నాటక ఎన్నికల్లో పేద ప్రజల శక్తి విజయం సాధించిందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది పునరావృతమవుతుందన్నారు. పేదల సమస్యల కోసం కాంగ్రెస్ పోరాడిందన్నారు. ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలో కర్నాటక ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ అన్నారు రాహుల్. కర్నాటకలో పెత్తందారులకు,పేదలకు మధ్య జరిగిన పోరాటంలో.. బలవంతులపై పేదల శక్తే గెలిచిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందన్నారు. ప్రేమతో కన్నడ ప్రజల మనసు గెలుచుకున్నామని రాహుల్ గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 140 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.