Home Page SliderNational

కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన కర్ణాటక సీఎం

Share with

కర్ణాటక సీఎం సిద్దరామయ్యను విమర్శిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఓ వీడియోను షేర్ చేశారు. అయితే దీనిపై సీఎం సిద్దరామయ్య స్పందించి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా కేటీఆర్? ఎందుకంటే మీకు ఏది ఫేక్..ఏది ఏది ఎడిట్ చేశారో ధ్రువీకరించడమే తెలియలేదు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోను మీ పార్టీ సర్క్యులేట్ చేస్తుంది. మీది బీజేపీకి చెందిన పర్ఫెక్ట్ బీ టీమ్ అని సిద్దరామయ్య ట్వీట్‌లో వెల్లడించారు. అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సంబంధించిన ఓ వీడియోపై కేటీఆర్ స్పందించారు. కాగా ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.అంత మాత్రనా ఫ్రీగా ఇవ్వాలా అని సీఎం సిద్దరామయ్య ఆ వీడియోలో అన్నారు. దానిపై స్పందించిన కేటీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బు లేదని సిద్దరామయ్య అంటున్నారు. హమీలు ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణా భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.