Home Page SliderInternational

ఆస్కార్ బరిలో నిలవనున్న ‘కాంతార’

Share with

సూపర్ హిట్ కన్నడ చిత్రం ‘కాంతార’ కూడా ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌ కి ఎంపికైంది. భారతీయ సినిమాలు ప్రపంచ స్థాయిలో దుమ్ము రేపుతున్నాయి. మొన్నటికి మొన్న మన తెలుగు చిత్రం ‘RRR’ ఆస్కార్ బరిలో నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళిని ఇంటర్నేషనల్ స్థాయిలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వరించింది. కాగా ఈరోజు చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన కన్నడ సినిమా ‘కాంతార’ కూడా ఆస్కార్‌కు ఎంపికైంది. ఆస్కార్‌కు క్వాలిఫై అయినట్లుగా చిత్ర నిర్మాణసంస్థ హొంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం జరుగబోయే 95 వ ఆస్కార్ అవార్డుల జాబితాలో ‘కాంతార’ను కూడా నామనేషన్లలో చేర్చాలని అప్లికేషన్ పంపారు. ఇప్పుడు ఈ చిత్రం రెండు విభాగాలలో క్వాలిఫై అయినట్లుగా నిర్మాణ సంస్థ తెలియజేసింది. కేవలం 15 కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన ఈ సినిమా ప్రస్తుతం 400 కోట్ల కలెక్షన్స్‌ తో దూసుకుపోతోంది. కన్నడ నిర్మాత రిషబ్ షెట్టి హీరోగా నటించి,నిర్మించిన చిత్రం ఇది. ప్రాచీన భూతకోల సంప్రదాయాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది.