Home Page SliderNational

కేన్ మామ “నువ్వు త్వరగా కోలుకోవాలి”

Share with

ప్రముఖ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్స్‌న్ ఇటీవల ప్రారంభమైన IPL 2023లో గాయపడ్డారు. కాగా మ్యాచ్ ఆడే సమయంలో ఆయన మోకాలికి దెబ్బ తగిలింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన మ్యాచ్ ఆడలేరని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన IPL 2023కి పూర్తిగా దూరమయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. దీనిని చూసిన కేన్ ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో ఆయన కాలికి కట్టుకట్టి ఉండగా.. రెండు ఊత కర్రల సాయంతో నిల్చొని ఉన్నారు. “గుజరాత్ టైటన్స్ ‌తో పాటు రెండు రోజులుగా తనకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. రికవరీ కోసం ఇంటికి వెళ్తున్నాను” అని పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అంతా “GET WELL SOON” కేన్ మామ అని కామెంట్స్ చేస్తున్నారు.