Home Page SliderTelangana

కేసీఆర్ రాకతో కామారెడ్డి మారిపోతుంది: మంత్రి కేటీఆర్

Share with

కామారెడ్డి: కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్.