Home Page SliderTelangana

కల్వకుర్తి: బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి తరఫున ప్రచారంలో ఈటల

Share with

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ  అభ్యర్థి తల్లోజు ఆచారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

ఆచారి గారిని చూస్తుంటే బాధ అవుతుంది. ఆయన్ను ఇన్నిసార్లు ఎలా ఓడించారు. సమ్మెలు, సంఘాలు ఉండవద్దు అని శాసించిన వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ బస్సులు లేకుండా చేశారు. ప్రజావ్యతిరేకి కేసీఆర్. బీజేపీ 60 సీట్లు గెలవబోతోంది.

ఒక ఛాయ్ వాలా ప్రధాని అయ్యారు. పేదవారి ఆకలి తెలిసిన వారు. నా మోదీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేత భుజం మీద చెయ్యి వేసి మాట్లాడే సత్తా సంపాదించుకున్నారు. బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేయాలని సంకల్పంతో మోదీ పనిచేస్తున్నారు. కరోనా సమయంలో దేశ ప్రధానులు ఏడుస్తుంటే.. మన ప్రధాని మోదీ ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ప్రపంచానికి వాక్సిన్ అందించారు. 140 కోట్ల ప్రజలకు ఉచితంగా వాక్సిన్ అందించారు. 30 ఏళ్లుగా ఏ బీ సీ డీ కోసం కొట్లాడుతున్న మాదిగ జాతి బిడ్డలను అక్కున చేర్చుకుని పరిష్కరిస్తున్న ప్రధాని మోదీ.

ఆ మాదిగ జాతి బీజేపీకి అండగా ఉంటుంది. బీసీను సీఎం చేస్తా అని చెప్పినందుకు బీసీ జాతి బీజేపీకి అండగా ఉంటుంది. రూ.3,100 మద్దతు ధర వరికి ఇవ్వబోతున్నాం. కేసీఆర్ కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లా తీస్తాడా అని అనబోతున్నారు. ఇక్కడ చనిపోయిన రైతులను పట్టించుకోని వాడు వేరే రాష్ట్రాలకు పోయి సాయం చేస్తాడట. అబ్ కి సర్కార్ కిసాన్ సర్కార్ పచ్చి అబద్దం. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు. ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా మోసం చేసినవారు కేసీఆర్.

ప్రైవేట్ కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రేషన్‌కార్డు అందిస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం. ఉచిత వైద్యం, విద్య అందిస్తాం. గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలు మాకు రావు. అవన్నీ చేసేది కేసీఆర్. కేసీఆర్ ఓడిపోతేనే ప్రజలకు సుఖం, సంతోషం. ప్రజలను వేధించే పార్టీ BRS.

30 ఏళ్లుగా ఓడిపోతున్నా మీతోనే ఉంటున్న బిడ్డ ఆచారి. మీరు ఆశీర్వదిస్తే అణగారిన వర్గాల బిడ్డ ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కి ఓటు వేసినా, కాంగ్రెస్‌కి ఓటు వేసినా సీఎం అయ్యేది మీరు వద్దు అనుకుంటున్న కేసీఆర్. మేము ధర్మం, న్యాయం, ప్రజలను నమ్ముకున్నాం. అంతిమంగా కనికరించవలసింది కల్వకుర్తి ప్రజలు. ఈ సారీ ఆచారి గారిని ఆశీర్వదించండి.