Home Page SliderNational

“కల్కి” సినిమా ఓ అద్భుతం: రాజమౌళి

Share with

ఈ రోజు థియేటర్లలో  విడుదలైన “కల్కి” సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.కాగా ఈ సినిమాపై టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ..“కల్కి” సినిమా తనకెంతో నచ్చిందన్నారు. ఈ సినిమాని అద్భుతమైన టేకింగ్‌తో అదరగొట్టారన్నారు. కాగా కల్కిలో ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందన్నారు. మరోవైపు ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా సపోర్ట్ అద్భుతమని జక్కన్న పేర్కొన్నారు.  అయితే చివరి 30 నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిందన్నారు. “కల్కి” సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి టీమ్ అసాధారణ ప్రయత్నాన్ని రాజమౌళి అభినందించారు.