Home Page SliderInternational

విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న కల్కి

Share with

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీ సేల్స్‌లో ఓవర్సీస్‌లో  రెండు మిలియన్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. కొన్ని గంటలలోనే ఆస్కార్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియాలో 5వేల టికెట్లు, నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్లు బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి ప్రమోషన్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. బుజ్జి వాహనం ఇప్పటికే అన్ని నగరాలు చుట్టేసింది. త్వరలో ఢిల్లీకి చేరబోతోంది. ఇంకా రిలీజ్‌కు సమయం ఉండడంతో కలెక్షన్లు ఇంకా పెరగవచ్చని అంచనాలు పెరుగుతున్నాయి.