Home Page SliderNational

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న “కల్కి”

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కల్కి”. రెండు రోజులు క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు ఈ సినిమా రూ.107కోట్లు వసూలు చేసినట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో మొత్తం రూ.298.5కోట్ల వసూళ్లు సాధించింది. అయితే  ఈ శని,ఆదివారం వీకెండ్ కావడంతో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా చూస్తే ఈ సినిమా మరో రెండు రోజుల్లో రూ.550కోట్ల వసూళ్లు రాబడుతోందని సినీ ప్రముఖలు అంచనా వేస్తున్నారు.