Home Page SliderNational

ప్రిరిలీజ్ బిజినెస్‌లో రికార్డ్ సృష్టించిన “కల్కి”

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం “కల్కి”.కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రూ.385కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. కాగా తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు ,హిందీలో రూ.85 కోట్లు,కర్ణాటకలో రూ.28కోట్లు, తమిళనాడులో రూ.16 కోట్లు,కేరళలో రూ.6కోట్లు,ఓవర్సీస్‌లో రూ.70కోట్ల బిజినెస్ జరిగినట్ల తెలుస్తోంది. అయితే ప్రభాస్ కెరీర్‌లో అత్యధికంగా ప్రిరిలీజ్ వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనె,అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.