Home Page SliderNational

“కల్కి” వసూళ్ల సునామీ..6రోజుల్లో రూ.680కోట్లు

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కల్కి”. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా కల్కి సినిమా విడుదలైన 6 రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే వీకెండ్స్‌లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. కాగా సోమ,మంగళ వారాల్లోనూ కల్కి రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే పెట్టుబడి మొత్తాన్ని రాబట్టిందని పలువురు సినీ ప్రముఖలు పేర్కొన్నారు. అయితే ఈ వీకెండ్స్‌లో కల్కి సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో కమల్ హాసన్,అమితాబ్ బచ్చన్,దీపికా పదుకుణె కీలక పాత్రలు పోషించారు.