InternationalNews

ఆఫ్రికన్లకు కాలా చష్మా ఫీవర్

Share with

కాలా చష్మా పాట ఇండియాలో ఎంత పాపులర్ అంటే చెప్పడానికి కొంచెం కష్టమే.. దేశ, విదేశాల్లోనూ ఈ పాటకు జనం ఆడిపాడారు. తాజాగా కాలా చష్మా పాటకు ఆఫ్రికన్ చిన్నారులు ఆడిపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఆఫ్రికాలో చిత్రీకరించిన ఈ వీడియోకు నెటిజిన్లు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు కాలా చష్మాకు ఎన్నో విధాలుగా జరిగిన పర్ఫామెన్స్ చూసినవారికి… తాజాగా ఆఫ్రికా చిన్నారులు వేసిన స్టెప్పులు ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తాయ్. ఈ వీడియోనూ ఏవియేటర్ అనిల్ చోప్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకోవడంతో ఇండియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

కాలా చష్మా ఈ వర్షన్ వీడియోను చిన్నారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే కోటి 60 లక్షలక మందికి పైగా చూశారు. 11 వేల మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఆఫ్రికా చిన్నారులు ఇండియా మ్యూజిక్ ఎంతగా ఇష్టపడుతున్నారోనంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ వీడియోను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.