NationalNews Alert

చంద్రముఖిగా కాజల్ అగర్వాల్

Share with

చంద్రముఖి సినిమాకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆ సినిమా పేరు చెబితే డైలాగ్స్‌తో సహా చెప్పేస్తుంటారు. అందులో రజనీ కాంత్ యాక్టింగ్ అదరగొట్టారు. డ్యూయల్ రోల్ , సినిమా స్క్రిప్ట్ , గ్రాఫిక్స్ వంటి ఎన్నో అంశాలతో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరిని అలరించిన సినిమా అది. అయితే దీనిని డైరెక్ట్ చేసిన పి.వాసు దీని సిక్వేల్‌గా చంద్రముఖి-2 ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈసారి పాత వారితో కాకుండా… ఇతర నటీమణులను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న చిత్ర యూనిట్ కాజల్‌కు కథ చెప్పినట్టు తెలుస్తోంది. దానికి కాజల్ కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటించనున్నారు. చంద్రముఖి పాత్రలో ఇంతకముందు జ్యోతిక నటించగా ఈసారి కాజల్ ఆ పాత్రలో ఏలా ఉంటారో వేచి చూడాలి.