Breaking NewsNational

జియో యాప్ “ఫ్రీ” కాదు ఇకపై చార్జీల మోతే

Share with

 జియో సినిమా యాప్‌కు ఛార్జీలు వసూలు చేయబోతున్నామని ప్రకటించింది జియో సినిమా. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ బాటలో సినిమాలు, సిరీస్‌లు ‘జియో సినిమా’లో ప్రసారం చేస్తామని తెలియజేసింది. రిలయెన్ప్ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది. రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించే విధానంలో మొదట ఉచితాలు ప్రకటించడం. అలవాటు పడ్డాక వాటికి చార్జీలు వసూలు చేయడం పరిపాటయిపోయింది.

నిన్న మొన్నటి వరకూ జియోసినిమా యాప్ ఫ్రీ అంటూ ప్రచారం చేసి, ఇకపై చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. మే 28 వతేదీన ఐపీఎల్ ముగిసిన తర్వాత ఛార్జీలు మొదలవుతాయని, అప్పటి వరకూ ఉచితంగా చూసుకోమని అవకాశం ఇచ్చింది. వీరి వ్యాపార సిద్ధాంతం ప్రకారం మొదట్లో జియో సిమ్ కార్డును కూడా ఫ్రీగా ఇచ్చేవారు. ప్రజలు కొన్నాళ్లు అలవాటు పడ్డాక కాల్ ఛార్జీలను కూడా పెంచారు.