Andhra PradeshNews Alert

జనసేనాని పుల్ ఫైర్     

Share with

విజయవాడలో జరిగిన ఘటనపై  స్పందించిన జనసేన అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు నిర్మించిన దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చేశరని , వైసీపీ రంగులు వేశారని స్పష్టం చేశారు. దీనిపై ధర్నాకు దిగిన పోతిన మహేష్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అయినా దిమ్మెను తొలగించిన వారిని వదిలేసి , జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అధికార పార్టీ శ్రేణులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. దీనిపై పోలీసులు , అధికారులు కాస్త ఆలోచించాలన్నారు పవన్. శాంతి బధ్రతలకు ఎటువంటి ఆటంకం కలిగించకుడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నానన్నారు. తమ ఉనికిని తీసేయడం ఎవరి తరం కాదన్నారు.

పార్టీకి ప్రజల అండ ఎప్పుడు ఉంటుందని , తమ పార్టీకి అపద వస్తే ప్రజలే దాన్ని కాపాడుకుంటారన్నారు. అధికార పార్టీ అన్నీ కార్యకాలపాలను ముందస్తు చర్యలతోనే చేస్తుందా అని ప్రశ్నించారు. అలా చేస్తే వాటికి సంబంధించిన అన్నీంటికి అనువతులు ఉన్నాయని పోలీసులు పఆకటించగలరా? అన్నారు. అనుమతులు లేని వాటిని పోలీసులు తొలగిస్తారా ? అన్నారు. పోలీసుల తీరు మారకుంటే నేను రంగంలోనికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.  

Read more: అమిత్ షాకు అసదుద్దీన్ ఒవైసీ లేఖ