Andhra PradeshHome Page Slider

జనసేన అధినేత ధర్మయాగం

Share with

ఏపీలో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.కాగా ఆంధ్రప్రదేశ్లో మరో 10 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజులు పాటు సాగే యాగాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. గణపతి పూజతో యాగానికి అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షతో దేవత మూర్తులకు ప్రణతులు అర్పించారు. ఈ యాగం నేడు కూడా కొనసాగనుంది.

మరోవైపు జూన్ 14 నుంచి 23 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన పార్టీ ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర భీమవరం వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన యాగం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. అలానే మంగళగిరిలోని జనసేన కార్యాలయం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలు ఇప్పటివరకు హైదరాబాదు నుంచి కోనసాగుతున్నాయి. ఇకమీదట మంగళగిరి నుంచి పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ నిపుణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.