Andhra PradeshHome Page Slider

జగన్ మార్క్ రాజకీయం కావాలా… చంద్రబాబు మార్క్ రాజకీయం కావాలో తేల్చుకోండి!

Share with

కుప్పం బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగన వైఎస్ జగన్
బలహీనవర్గాల ప్రతినిధిని ఎన్నుకోండి, మంత్రిని చేస్తా…
కుప్పంలో ఏ గ్రామానికైనా వెళ్దాం.. మంచి ఎవరు చేశారో తెలుస్తోంది
రంగాను హత్య చేయించింది చంద్రబాబే కాదా అంటూ ఆరోపణలు

35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ… స్థానికంగా ఇళ్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు సీఎం వైఎస్ జగన్. 35 ఏళ్లలో కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారన్నారు. మరి చంద్రబాబును కుప్పం ప్రజలకు ఏమిచ్చారని నిలదీయాలన్నారు. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలకు మంచి చేయని 75 ఏళ్ల వయసొచ్చిన ఈయన మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడంటూ జగన్ ఎద్దేవా చేశారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాడన్నారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ… ఏ పేదోడికి మంచి చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ ఇంటికి మేలు చేయలేదని… ఏ ప్రాంతానికి మంచి చేయలేదని… కానీ… మరో నలుగురితో పొత్తు పెట్టుకొని పోటికి దిగుతున్నాడన్నారు. అసలు మంచి చేస్తే పొత్తు ఎందుకని అడిగితే చంద్రబాబు మాట్లాడడని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా జగన్ ప్రశ్నించారు. ఏ గ్రామం వద్ద ఐనా నిలబడి, ఈ గ్రామంలో నా మార్క్ పలన ఇది… మంచి చేశానని చెప్పలేని పరిస్థితితన్నారు జగన్.

రాష్ట్రంలోని వివిధ సామాజికవర్గాలకు మీరు చేసిన మంచేంటి, న్యాయమేంటని అడిగితే చివరకు బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పంలో బీసీ ఎమ్మెల్యేలను పెట్టని పరిస్థితి అని అన్నారు వైఎస్ జగన్. పేద ఇంటికి వెళ్దాం. తలపుతట్టి ఆ ఇంట్లో అడుగుదాం. 14 ఏళ్లలో మీరు చేసిన మంచేంటో అడుగుదామన్నారు జగన్… చంద్రబాబు గ్రామాలకు ఏం చేశారో అది కూడా చెప్పడన్నారు. మరి పొత్తుల గురించి మాత్రం దత్త పుత్రుడితో మాట్లాడతాడన్నారు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంతని మాట్లాడతాడన్నారు. పోనీ… కాపులకు మీరు చేసిన మంచేంటని జగన్ ప్రశ్నించారు. వంగవీటి రంగాను హత్య చేయించిది మీరే కదా.. ! అందుకే వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారన్నారు జగన్. ఇదే బాబు మార్క్ రాజకీయమని ఆక్షేపించారు. చంద్రబాబు మార్క్ రాజకీయమంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు అంటూ విమర్శలుగుప్పించారు.

కుప్పం ప్రజలకు మంచి చేశానని చెప్పకపోవడం బాబు మార్క్ రాజకీయం ఐతే, కుప్పంలో గత ఎన్నికల్లో పలానా మంచి చేశానని చెప్పలేకపోవడం, బాబు మార్క్ రాజకీయమైతే.. గత ఎన్నికల్లో కుప్పంలో బాబుపై గెలవలేకపోయినా మీలో ఒకర్ని బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్‌ను ఎమ్మెల్సీగా చేశానన్నారు జగన్. బలహీనవర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి… ముందు పెట్టి ఇక్కడ పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయమని చెప్పడానికి గర్వపడుతున్నాన్నారు. బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేశానన్న జగన్, 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పం నియోజకవర్గానికి ఇంత మేలు చేశానన్నారు. ఇదే భరత్, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి.. నా కేబినెట్‌లో మంత్రిగా స్థానమిస్తాను. గుండెల్లో పెట్టుకుంటాను. తద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాటిస్తానన్నారు జగన్… చంద్రబాబు మార్క్ రాజకీయం కావాలో… జగన్ మార్క్ మార్క్ రాజకీయం కావాలో ప్రతి ఒక్కరినీ ఆలోచించాలన్నారు జగన్.